నవోదయలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

KDP: ఉమ్మడికడప జిల్లాలో నవోదయ ప్రవేశానికి ఈనెల 27 వరకు గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. రాజంపేట మండలం నారంరాజుపల్లె జవహర్ కళాశాల ప్రిన్సిపల్ గంగాధరన్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో 5వతరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని అన్నమయ్య, కడప జిల్లాలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.