'అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి'
అన్నమయ్య: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ఏప్రిల్ 14న రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటలకు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని సూచించారు. అంబేద్కర్ ఆశయాలు సమాజంలో సమానత్వాన్ని తీసుకువస్తాయని పేర్కొన్నారు.