జొన్నవాడ ఆలయంలో దర్శన వేళల్లో మార్పు

జొన్నవాడ ఆలయంలో దర్శన వేళల్లో మార్పు

NLR: ధనుర్మాసం సందర్భంగా జొన్నవాడ కామాక్షితాయి ఆలయ దర్శనం వేళల్లో మార్పులు చేసినట్లు ఆలయ ఈవో అరవ భూమి శ్రీనివాసులురెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 16 నుంచి జనవరి 14 వరకు ఉదయం 6 నుంచి 12 వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు కల్పించబడుతుందన్నారు. శుక్రవారం మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 9:30 వరకు దర్శనం కల్పించబడుతుందని తెలిపారు.