నందిగామలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు

నందిగామలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు

NTR: నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. పీలేరు బార్ అసోసియేషన్‌కు చెందిన యువ న్యాయవాది యల్లయ్యను అతి క్రూరంగా దాడి చేసి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు.