‘ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి’

MBNR: పెండింగ్ స్కాలర్‌షిప్ లు, ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో విద్యార్దులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతపట్టుకుని రోడ్డుపై బైటాయించి ధర్నా చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఉపకారవేతనాలు విడుదల చేయకపోతే, ఉద్యమం ఉధృతం చేస్తామని తెలిపారు.