VIDEO: వనపర్తిలో సడన్‌గా ప్రారంభమైన వర్షం

వనపర్తి పట్టణంలో గురువారం ఉదయం సడన్‌గా వర్షం కురవడం ప్రారంభమైంది. గత 3 రోజుల నుంచి జిల్లావ్యాప్తంగా ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు ఉక్కపోతకు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పెద్ద వర్షం ప్రారంభం అవడంతో ప్రజలకు ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం లభించినట్లయింది. కాగా స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు, పనులకు వెళ్లే వారు వర్షం కారణంగా ఇబ్బందులు పడ్డారు.