రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే
MBNR: ప్రజాపాలనలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. నవాబుపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులకు కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు ఏర్పాటు చేశామన్నారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధర చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.