హనుమంతరాయ చౌదరి కుటుంబానికి మంత్రి పరామర్శ

హనుమంతరాయ చౌదరి కుటుంబానికి మంత్రి పరామర్శ

ATP: మంత్రి పయ్యావుల కేశవ్ బుధవారం ఎర్రంపల్లి గ్రామాన్ని సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నం మారుతి చౌదరి సహా ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.