కూలిన మట్టి ఇళ్ళను పరిశీలించిన ఎస్టీ కమిషన్ సభ్యులు
అల్లూరి: తుఫాను ప్రభావిత గ్రామమైన అరకులోయ మండలం సుంకరమెట్ట పంచాయతీలోని పీరిబంద గ్రామాన్ని బుధవారం ఎస్టీ కమిషన్ సభ్యులు కిల్లో సాయిరాం సందర్శించారు. ఈ మేరకు గ్రామంలో భారీ వర్షానికి తడిచి నేలకూలిన మట్టి ఇళ్లను సర్పంచ్ చినబాబుతో కలసి పరిశీలించి, ప్రభుత్వం ఆదుకుంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాన్ని పరిశీలించారు.