గీసుకొండలో ఎన్నికల బందోబస్తు కట్టుదిట్టం: సీఐ

గీసుకొండలో ఎన్నికల బందోబస్తు కట్టుదిట్టం: సీఐ

WGL: గీసుకొండలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సీఐ విశ్వేశ్వర్ అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు. నియమావళి అమలులో శాంతి భద్రతల కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్నికలు శాంతియుతంగా, నిష్పాక్షికంగా జరిగేలా కట్టుదిట్టమైన బందోబస్తుతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.