VIDEO: ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవం
సత్యసాయి: సోమందేపల్లి మండలం చెన్నాపురం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయంలో హోమాలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ ధర్మకర్త పవన్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది శ్రీరామ నవమి సందర్భంగా ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీ సీతారామ కళ్యాణం చేస్తామన్నారు.