'దేవస్థానాల అభివృద్ధికి జీవో తీసుకురావాలి'

'దేవస్థానాల అభివృద్ధికి జీవో తీసుకురావాలి'

ADB: గోండ్వాన దేవస్థానాల అభివృద్ధి కోసం ప్రత్యక జీవోను తీసుకురావాలని రాజ్ గోండ్ సేవ సమితి సభ్యులు కోరారు. గురువారం ఉట్నూరులో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఆదివాసీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోండు మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు అర్జు, విషంరావు, మోతిరాం ఉన్నారు.