వాహనాలు తనిఖీ చేసిన అధికారులు

వాహనాలు తనిఖీ చేసిన అధికారులు

కృష్ణా: నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో ప్రాంతీయ రవాణా అధికారి నాగ మురళి ఆదేశానుసారం ప్రాంతీయ ఉప రవాణా అధికారి కృష్ణవేణి మంగళవారం వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు, కఠిన చర్యలు తప్పవు అన్నారు.