విషాదం.. బావిలో పడ్డ కవలలు
TG: కరీంనగర్‌లోని జూబ్లీనగర్‌లో విషాదం నెలకొంది. ఐదేళ్ల కవలలు బావిలో పడ్డారు. ఈ క్రమంలో ఒకరి మృతదేహం వెలికితీయగా మరొకరి కోసం గాలిస్తున్నారు. మరోవైపు చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.