మదీనాగూడ యూ-టర్న్ వద్ద క్రాస్ బారియర్లు ఏర్పాటు

మదీనాగూడ యూ-టర్న్ వద్ద క్రాస్ బారియర్లు ఏర్పాటు

HYD: మదీనాగూడ యూ-టర్న్ వద్ద రోడ్డు భద్రతను పెంచడానికి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి క్రాస్ బారియర్లను ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం, రాంగ్ రూట్ డ్రైవింగ్‌ను అరికట్టడం, చందానగర్ వైపు వెళ్లే ట్రాఫిక్ సాఫీగా సాగేలా చేయడం దీని ముఖ్య ఉద్దేశం అని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సురక్షితమైన ప్రయాణం కోసం వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలన్నారు.