ప్రశాంతంగా ప్రారంభమైన ఆదివారం ఆరాధన
KKD: గొల్లప్రోలు పట్టణంలో డిసెంబర్ 7న రెండు చర్చిలకు అనుమతి నిరాకరించగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొన్ని షరతులతో అనుమతులు మంజూరు చేశారు. వివాదాలు తలెత్తకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఒక చర్చిలో ఆరాధన ప్రశాంతంగా ప్రారంభమైంది. ఏఎస్పీ దేవారాజ్ పాటిల్ ఆదివారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి, ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.