ఎయిడ్స్‌పై అపోహలు వద్దు: DLSA కార్యదర్శి

ఎయిడ్స్‌పై అపోహలు వద్దు: DLSA కార్యదర్శి

MBNR: ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన DLSA కార్యదర్శి డి. ఇందిరా మాట్లాడుతూ.. ఎయిడ్స్‌పై సమాజంలో ఉన్న అపోహలను తొలగించాలని అన్నారు. బాధితుల పట్ల సహానుభూతి చూపడంతో పాటు, నిరోధక చర్యలపై యువతలో అవగాహన పెంచడం ముఖ్యమని తెలిపారు.