ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు
ASR: చింతపల్లిలో బైక్‌లు ఢీకొనడంతో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం జీ.మాడుగుల మండలం వంజరి గ్రామానికి చెందిన సంతోషకుమార్, సింహాద్రి బైక్ పై గున్నమామిడి వెళ్లి, స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. చింతపల్లికి చెందిన యోగేంద్ర చిన్నగెడ్డ వెళుతున్నాడు. రెండు వాహనాలు చింతపల్లి ఏపీఆర్ కళాశాల ఎదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.