ఉమ్మడి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
NZB: ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయారు. పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలకు రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. ఉమ్మడి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.