'మూగజీవాల దాహార్తి తీర్చేందుకు తొట్ల ఏర్పాటు'
KDP: ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా మూగజీవాల దాహార్తి తీర్చడానికి నీటి తొట్టిలను నిర్మిస్తోందని ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ సునీత అన్నారు. బుధవారం మండల పరిధిలోని మూలవారిపల్లెలో పశువుల నీటి తొట్టెలను పరిశీలించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని తొట్టెలకు నీటిని నింపేలా చూడాలని, పశువులు దాహార్తికి సమస్య రాకూడదని ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రకు సూచించారు.