ఉద్యోగం నుంచి ప్రిన్సిపల్ తొలగింపు

ఉద్యోగం నుంచి ప్రిన్సిపల్ తొలగింపు

కృష్ణా: ప్రిన్సిపల్ రాజశేఖర్‌‌ను విధుల నుంచి తొలగించినట్లు కళాశాల యాజమాన్యం ప్రకటించింది. మచిలీపట్నంలోని ఓ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ రాజశేఖర్ ఓ విద్యార్థినితో చాటింగ్ చేస్తుండగా తల్లిదండ్రులు గుర్తించి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. కళాశాల యాజమాన్యం అతనిపై విచారణ జరిపి, అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది.