గుర్తు తెలియని వ్యక్తి మృతి
NZB: ప్రభుత్వ ఆసుపత్రి గేటు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు 1 టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఈనెల 12న ఆసుపత్రి మెయిన్ గేటు వద్ద గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తిని పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయసు 50 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేశారు.