గౌరవరం పాఠశాలలో డీవైఈవో ఆకస్మిక తనిఖీ

గౌరవరం పాఠశాలలో డీవైఈవో ఆకస్మిక తనిఖీ

NTR: జగ్గయ్యపేట మండలం గౌరవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీవైఈవో శ్యామ్ సుందర్ రావు ఆకస్మికంగా సందర్శించారు. 10వ తరగతి ఎస్ఏ-1 ఫలితాలను పరిశీలించి, సీ, డీ గ్రేడ్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకొని ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. మిడ్-డే మీల్స్ స్టాక్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు.