అతిగా నవ్వడం ప్రమాదకరం..!
నవ్వు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, బిగ్గరగా లేదా అతిగా నవ్వడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. అతిగా నవ్వే సమయంలో BP అకస్మాత్తుగా పడిపోయి, మూర్ఛ వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా గుండె సమస్యలు ఉన్నవారిలో హార్ట్ బీట్ మారడం, రక్తప్రసరణలో ఇబ్బందులు తలెత్తవచ్చని తెలిపారు. అందుకే మితంగానే నవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.