VIDEO: MPDO కార్యాలయంలో పారిశుద్ధ్య నిర్లక్ష్యం.. స్థానికుల ఆగ్రహం
BHPL: కాటారం MPDO కార్యాలయ ప్రాంగణంలో పారిశుద్ధ్య విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోంది. గత వారం రోజులుగా తినిపారేసిన ఎంగిలి ప్లేట్లు, చెత్త అలాగే పడి ఉండటంతో భయంకర దుర్వాసన వ్యాపిస్తుందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే ప్రాంగణాన్ని శుభ్రం చేసి, క్రమం తప్పకుండా పరిశుభ్రత కొనసాగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.