పులివెందులలో స్టాంపుల కొరత

KDP: పులివెందుల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్టాంపుల కొరత పట్టి పీడిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థలాలు కొని అగ్రిమెంట్ రాయించుకోవాలన్నా, ఇల్లు కొని అగ్రిమెంట్ రాయించుకోవాలన్నా స్టాంపుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి స్టాంపుల కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు.