డ్రైనేజ్‌లు లేక ప్రజల అవస్థలు

MDK: కాలనీలో డ్రైనేజ్‌లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ఒకటో వార్డు కాలనీలో మురికి కాలువ లేక కాలనీవాసులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. వర్షపు నీరు, మురికి నీరు రోడ్డుపై ప్రవహించడంతో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని కాలనీ వాసులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్న డ్రైనేజ్ నిర్మాణం జరగలేదన్నారు.