VIDEO: వైరా నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

VIDEO: వైరా నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

KMM: మధిర పట్టణంలోని వైరా నదిలో నిన్న మడుపల్లి కి చెందిన వినోద్ అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో NDRF బృందం చేపట్టిన గాలింపు చర్యల్లో బుధవారం వినోద్ మృతదేహం లభ్యమైంది. కాగా మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వినోద్ మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.