నేటి తరానికి పొట్టి శ్రీరాములు ఆదర్శం

నేటి తరానికి పొట్టి శ్రీరాములు ఆదర్శం

అన్నమయ్య: ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. మార్కెట్ సర్కిల్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు సేవలను కొనియాడారు. ఆయన పోరాట ప్రతిమ నేటి తరాలకు ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో కోట అశోక్ తదితరులు పాల్గొన్నారు.