కోనరావుపేటలో యువకుడి ఆత్మహత్య

SRCL: కోనరావుపేట గ్రామంలో తీవ్ర విషాధం నెలకొంది. కొలకానీ కాషయ్య ,సరళ దంపతుల రెండవ కుమారుడు కొలకానీ నవీన్ (21 ) బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్తున్నారు.