కలెక్టర్‌ను కలిసిన కసాపురం ఆలయ ఈవో
అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆనంద్‌ను గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ ఈవో విజయరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా కలెక్టర్‌కు స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాన్ని అందజేశారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి కలెక్టర్‌కు వివరించారు.