VIDEO: జేసీబీ సాయంతో రహదారికి మరమ్మతులు
కృష్ణా: మొవ్వ మండలంలోని కూచిపూడి నుంచి మొవ్వకు వెళ్లే ప్రధాన రహదారికి కొన్ని రోజులుగా గుంతలు ఏర్పడి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా వెంటనే స్పందించారు. జనసేన ఇంఛార్జ్ తాడిశెట్టి నరేష్ సూచనల మేరకు సొంత నిధులతో జేసీబీతో రహదారి మరమ్మతుల పనులను ఆదివారం చేపట్టారు.