విజయవంతంగా మెగా పేరెంట్స్, టీచర్స్ డే
కృష్ణా: పుట్టగుంట ZP స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్‌కు ఎస్సై శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా ఈరోజు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ఇలాంటి సమావేశాలు విద్యార్థుల విద్య పురోగతి, భవిష్యత్ లక్ష్యాలపై చర్చించడానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు.