'అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు'

'అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు'

కర్నూలు జిల్లాలోని రౌడీ షీటర్లకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, నేర ప్రవృత్తిని విడనాడి, సత్ప్రవర్తనతో జీవించాలని అన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సూచించారు. ఇందులో భాగంగా పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.