యాదాద్రి నేటి ఆదాయ వివరాలు ఇవే..!
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి శనివారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాలతో రూ.10,14,030, కార్ పార్కింగ్ రూ.5,51,500, VIP దర్శనాలతో రూ.4,35,000, బ్రేక్ దర్శనాలతో రూ.2,88,600, ప్రధాన బుకింగ్ రూ.2,78,150, వ్రతాలతో రూ.3,44,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.34,24,189, ఆదాయం సమకూరినట్లు తెలిపారు.