వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా గౌతం

NDL: వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా కటిక గౌతం నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా ఆయన నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని కటిక గౌతం తెలిపారు.