నగరంలో 'డ్రగ్స్ వద్దు బ్రో-సైకిల్ తొక్కు' ర్యాలీ
గుంటూరులో ఆదివారం 'ఈగల్' విభాగం ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. 'డ్రగ్స్ వద్దు బ్రో-సైకిల్ తొక్కు' అనే నినాదంతో యువత కదం తొక్కింది. ఈ కార్యక్రమానికి ఈగల్ ఐజీ రవికృష్ణ, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ అతిథులుగా హాజరయ్యారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, శారీరక దృఢత్వంపై దృష్టి పెట్టాలని వారు పిలుపునిచ్చారు.