తాళ్లూరులో 'సూపర్ జీఎస్టీ సేవింగ్‌పై' గ్రామసభ
GNTR: ఫిరంగిపురం మండలం 113 తాళ్లూరులోని పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం గ్రామసభ జరిగింది. ఈ సభలో 'సూపర్ జీఎస్టీ & సూపర్ సేవింగ్' అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గ్రామాభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఎన్.ఆర్.జీ.ఎస్. మండల టెక్నికల్ ఆఫీసర్, పంచాయతీ సెక్రటరీ వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.