ఆసుపత్రిలో మృతురాలి బంగారం మాయం
JGL: బంగారు చెవికమ్మలు మాయమైన ఘటన జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం అనారోగ్యంతో బాలవ్వ మృతి చెందిది. కుటుంబ సభ్యులు శోకంతో మృతదేహం ఇంటికి తీసుకెళ్లగా, చెవికమ్మలు లేవని గుర్తించారు. ప్రభుత్వాసుపత్రి సిబ్బందే దొంగతనం చేశారని వారు ఆరోపిస్తున్నారు. భాధ్యులెవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.