నవోదయ విద్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

KRNL: ఎమ్మిగనూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో శుక్రవారం విద్యాలయ ప్రిన్సిపాల్ ఈ. పద్మావతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ మేరకు విద్యార్థులు దేశభక్తిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.