జాతీయ రహదారిపై హెల్మెట్ డ్రైవ్

కృష్ణా: మచిలీపట్నం బందరు ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ నున్న రాజు ఆధ్వర్యంలో శుక్రవారం హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. జాతీయ రహదారి 216 లోని హర్ష కాలేజ్ సమీపంలో ఈ ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి కౌన్సిలెంగ్ ఇచ్చారు. వారిచే ISI మార్క్ కలిగిన హెల్మెట్లను కొనుగోలు చేయించారు.