'జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలి'

'జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలి'

మన్యం: జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని నూతన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని మంత్రి సంధ్యారాణి కోరారు. జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్ధికంగా, అభివృద్దిపరంగా వెనుకబడి ఉన్న జిల్లాను రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లాగా వృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.