VIDEO: భిక్కనూర్‌లో కోతుల స్వైరవిహారం

VIDEO: భిక్కనూర్‌లో కోతుల స్వైరవిహారం

KMR: భిక్కనూర్ మండల కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకూ మితిమీరిపోతోంది. ప్రధాన రహదారులు, ఇళ్ల పైకప్పులు, దుకాణాల వద్ద కోతులు గుంపులు గుంపులుగా చేరుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆహారం కోసం దుకాణాల్లోని వస్తువులను ఎత్తుకెళ్లడమే కాకుండా, అడ్డువచ్చిన వారిపై దాడికి దిగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.