పండగను ప్రశాంతంగా జరుపుకోవాలి: డీఎస్పీ

పండగను ప్రశాంతంగా జరుపుకోవాలి: డీఎస్పీ

నెల్లూరు: వినాయక చవితి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని గూడూరు డీఎస్సీ రమణ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న రోటరీ భవన్లో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని తెలిపారు. నిర్వాహకులు నిబంధనలు పాటించాలన్నారు.