VIDEO: పరీక్షా కేంద్రానికి పరుగు తీసిన విద్యార్థి
ప్రకాశం: గిద్దలూరులో సోమవారం ఉదయం 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షకు వెళ్లే సమయం దగ్గర పడడంతో పరీక్షా సెంటర్ చేరడానికి ఓ విద్యార్థి పరుగులు తీశాడు. పరీక్షలకు ముందుగానే పరీక్షా సెంటర్లకు హాజరు కావాలని అధికారులు తెలియజేశారు. ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు.