రాత్రి నుంచి రైతుల క్యూ లైన్

రాత్రి నుంచి రైతుల క్యూ లైన్

MDK: శివంపేట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సోమవారం రాత్రి నుంచి రైతులు యూరియా ఎరువు కోసం పడిగాపులు కాశారు. రాత్రి 9 గంటల వరకు సొసైటీ కేంద్రం వద్దకు విచ్చేసి అక్కడే నిద్రించారు. యూరియా ఎరువు కష్టాలు తప్పడం లేదని రైతులు వాపోయారు. మంగళవారం ఉదయానికి రైతులు పెద్ద ఎత్తున సొసైటీ వద్దకు విచ్చేశారు.