క్షయ వ్యాధిగ్రస్తులకు టీబీ కిట్ల పంపిణీ

క్షయ వ్యాధిగ్రస్తులకు టీబీ కిట్ల పంపిణీ

SRCL: తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరు గ్రామాలకు చెందిన 15 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు డాక్టర్ చంద్రిక రెడ్డి టీబీ కిట్లను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం అందించడమే ఈ టీబీ కిట్ల పంపిణీ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.