రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన డీజీపీ
RR: చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద సోమవారం బస్సు ప్రమాదం జరిగి 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పరిశీలించారు. ఘటనకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డీజీపీతో పాటు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ఉన్నారు.