VIDEO: ‘కూటమిలో ఆడవారికి రక్షణ లేదు’

NLR: కూటమి ప్రభుత్వంలో ఆడవారికి రక్షణ కరువైందని వైసీపీ మహిళ నేత పూజిత మండిపడ్డారు. జిల్లాలోని డైకస్ రోడ్ సెంటర్‌లో ఉన్న వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం సాయంత్రం పూజిత మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారులు, వృద్ధులపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. రోడ్డుమీద మహిళ ఒంటరిగా తిరగాలంటేనే భయపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.