రాహుల్ గాంధీ ఫోటోలను తగలబెట్టిన బీజేపీ నేతలు

ప్రకాశం: మార్కాపురంలోని గడియార స్తంభం సెంటర్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫోటోలను మంగళవారం బీజేపీ నేతలు పెట్రోల్ పోసి తగులబెట్టారు. బీహార్‌లోని కాంగ్రెస్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలను మందలించకుండా రాహుల్ గాంధీ వ్యంగంగా నవ్వడంపై నిరసన తెలిపారు. అరెస్ట్ చేయాలని పట్టణ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు.